Saturday, June 29, 2024

బేగంపేటలో ఉస్మాన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

బేగంపేటలో షేక్ ఉస్మాన్ హత్య కి ప్రేమ వ్యవహారమే కారణం అని నార్త్ జోన్ పోలీసులు తేల్చారు. బుధవారం నార్త్ జోన్ డిసిసి కార్యాలయంలో డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఓ జువైనల్‌తో సహా మొత్తంగా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగం పేట పాటిగడ్డ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ ,అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు.తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఉస్మాన్ అడ్డుకుంటున్నాడు. ఉస్మాన్‌తో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. మంగళవారం ఉస్మాన్ విషయంలో ఇరువురి కుటుంబాల మధ్య గొడవ జరిగింది. మంగళవారం సాయం త్రం బేగంపేట పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

కాగా ఉస్మాన్ పెళ్లి సంబంధాలు చెడగొడుతుండడంతో అమ్మాయి బావ ఇజాజ్ అతనిపై కోపం పెంచుకున్నాడు. తన మరదలకు ఉస్మాన్ వల్ల పెళ్లి సంబంధాలు చెడిపోతున్నాయని, దీంతో ఆతన్ని అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఉస్మాన్ కోసం మహ్మద్ ఇజాజ్ కాపు కాసి, బైక్ పై వస్తున్న ఉస్మాన్ ను ఆపి, కత్తి తో పొడిచి అడ్డగించాడు. ఉస్మాన్ కింద పడడంతో గొంతు కోశాడు. ఈ ఘటనలో ఉస్మాన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు .అనంతరం మహ్మద్ ఇజాజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఉస్మాన్ హత్యకు సహకరించిన మహ్మద్ ఫిరోజ్ , సాహిల్ ఖాన్, మహమ్మద్ ఫజల్, ఎండి.రషీద్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో బేగంపేట ఎ సి పి గోపాల కృష్ణ మూర్తి, ఇన్స్పెక్టర్ రామయ్య, ఎస్‌ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News