Monday, December 23, 2024

పరిగి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

- Advertisement -
- Advertisement -

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని తహశీల్‌దార్ కార్యాలయాన్ని గురువారం 25 మంది యువకులు ముట్టడించి ఆందోళన చేశారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 94, 95, 96లో గల 22 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. ఈ భూమిని పూడూరు మండల పరిధిలోని తిర్మాలాపూర్‌కు చెందిన రాత్లావత్ మెగారాజ్, పరిగి మండల పరిధిలోని నజిరాబాద్ తండాకు చెందిన కాట్రావత్ సుదర్శన్‌లతో పాటు కొంత మంది యు వకులు గత ఏడాది జులై 6వ తేదిన రియల్ ఎస్టేట్‌లో భూ యజమాని వెంకట్రాములు వద్ద అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ సమయంలో రూ. 10 లక్షలు ఇచ్చారు. తర్వాత రూ. 50 లక్షలు ఇచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకుని గురువారం ఇరతులకు 14 ఎకరాల భూమిని అమ్మేసి రిజిష్ర్టేషన్ చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న అగ్రిమెంట్ యువకులు తహాశాల్‌దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు. మాకు ఆర్థికంగా ఇబ్బందులు చేశారని నమ్మక ద్రోహాం చేసిన భూమి యాజమాని వెంకట్రాములును చూపించాని లేదని దొంగ తనంగా ఏలా రిజిష్ర్టేషన్ చేస్తారని ప్రశ్నించారు. దీంతో పోలీస్‌లు అక్కడికి ముందుగానే చేరుకుని వారిని చెదరగొట్టే ప్ర యత్నం చేశారు. దీంతో ఓ యువకుడు పెట్రోల్ బాటీల్‌తో ఆందోళన చేశారు. వెంటనే పోలీస్‌లు స్పంచింది పెట్రోల్ బాటీల్‌ను తీసుకున్నారు. అ క్కడి నుంచి యువకులను చెల్లా చెదరం చేశారు. దొంగ తనంగా యాజమాన్ని ఈలా చేయాల్సిన అ వసరం ఏముందని కొందరు యువకులు ఎమ్మార్వో దానయ్యను నిలదీశారు. తహాశీల్‌దారుకు భూమి రిజిష్ర్టేషన్ ఎవరికి చేయవద్దని ఫి ర్యాదు కూడా చేశామని యువకులు తెలిపారు. ఫిర్యాదును పట్టించుకోకుండా ఇందులో 14 ఎకరాల భూమిని ఇతరులకు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News