Wednesday, January 22, 2025

18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మెదక్ : 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఇంటింటి సర్వేలో భాగంగా మెదక్ మండలం ఖాజిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఆరు ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్న కిషన్‌రావు ఇంటికి తహశీల్దార్ శ్రీనివాస్, బూతు స్థాయి అధికారులతో కలిసి వెళ్లి ఓటరు జాబితా ప్రకారం అందరు ఓటర్లు ఒకే ఇంట్లో ఉన్నారా అని వాకబు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటికి సర్వే ప్రక్రియ కట్టుదిట్టంగా సకాలంలో పూర్తి చేయాలని బూతు స్థాయి అధికారులకు సూచించారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన వారిపేర్లు పునఃపరిశీలించాలని మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహాంకాళి స్వప్న సిద్దు యాదవ్, బూతుస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News