Thursday, January 23, 2025

మీది ఫెయిల్యూర్ మోడల్

- Advertisement -
- Advertisement -

మాది 24 గంటల పవర్‌ఫుల్ మోడల్
ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు?

కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు కెటిఆర్ కౌంటర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటకలో మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్..తెలంగాణలో మాది 24 గంటల పవర్ ఫుల్ మోడల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. నుంచి అలంపూర్ వర కు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన తమది అని రం చేపట్టి ఆరు నెలలు గడవకముందే…తీవ్ర వ్యతిరేకత మూ టగట్టుకున్న ప్రభుత్వం మీది అని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి.. ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి..ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ అని వ్యాఖ్యానించారు.

రైతులకు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు..మీ ప్రజలకిచ్చిన ఐదు హామీలను.. ఐదేళ్లయినా అమలు చేయలేరని సిద్దిరామయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ రాష్ట్రంలో కనీసం రేషన్ ఇవ్వలేరు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు..? అని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. బిసిలు ఇంకా వెనకబడి ఉన్నారంటే…ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే.. వైఫల్యాల కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధం..! నమ్మి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం చెప్ప డం తథ్యం..!! అని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కర్ణాటకన సిఎం సిద్ధిరామయ్యను విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News