Monday, December 23, 2024

లష్కరే తొయిబా తీవ్రవాది యూసుఫ్ కంట్రూ హతం

- Advertisement -
- Advertisement -

జమ్మూ: కశ్మీర్‌లో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు తీవ్రవాదులను జవాన్లు బారాముల్లా ఎన్ కౌంటర్లో హతమార్చారు. వారిలో ఒకరు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యూసుఫ్ కంట్రూ ఉన్నాడు. ఆ ఇద్దరు తీవ్రవాదులు తుపాకుల ఎదురు కాల్పుల్లో మరణించారు. బారాముల్లా జిల్లాకు చెందిన కుంజర్ ప్రాంతంలో వారు హతమయ్యారు. భద్రతా దళాలకు వారికి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో వారు మరణించారు. కాగా కాల్పుల్లో నలుగురు జవానులు, ఓ పోలీసు కూడా గాయపడ్డారు. కంట్రూను హతమార్చడంతో జమ్మూకశ్మీర్ లోయలో భద్రతా బలగాలకు ఓ విజయం సిద్ధించినట్టయింది. యూసుఫ్ కంట్రూ 2000 సంవత్సరం నుంచే తీవ్రవాదిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. దాదాపు 22 ఏళ్ల పాటు తీవ్రవాదిగా పనిచేస్తున్నాడని తెలిసింది. అతడు తన జీవిత కాలంలో పౌరులు, భద్రతా బలగాలపై అనేక దాడులు నిర్వహించాడని కూడా వారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News