Thursday, December 26, 2024

గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట: గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.దీనిపై గురువారం కోన రావుపేట పోలీస్ స్టేషన్ లో చందుర్తి సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ.రమాకాంత్ విలేకరులతో సమావేశం మాట్లాడుతూ కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారని,మరికొందరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పెట్టుకున్నారు. వేములవాడ నాంపల్లికి చెందిన జాన్ ప్రతాప్ రెడ్డి,సుద్దాలకు చెందిన వెంకటేష్, నాగారం సాగర్,మారుపాక చరణ్,నాంపల్లి జడల నాగరాజు లు నిందితులను అరెస్ట్ చేసి,వారి నుండి 125 గ్రామాల గంజాయి,6 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారని సి.ఐ కిరణ్ అన్నారు.

నలుగురు నిందితులను గురువారం రిమాండ్ కు పంపిస్తున్నామని,మొదటి నిందితుడైన జాన్ ప్రతాపరెడ్డి పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని అన్నాడు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహారించిన ఎస్.ఐ. రమాకాంత్, ఏ ఎస్.ఐ. శ్రీనివాస్, కానిస్టేబుల్ లు జగన్,ప్రమోద్,అబ్బాస్ లను సి.ఐ ప్రశంసించాడు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. మత్తు పదార్థాలతో జీవితాన్ని పాడుచేసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టదని సన్మార్గంలో నడచి జీవితాన్ని బాగు చేసుకోవాలని అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News