Sunday, December 22, 2024

ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్స్… యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తరచూ బాంబు పెట్టారని, హైజాకర్స్ వచ్చారని మెయిల్స్ చేస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీ గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాడు.

మానసికంగా ఒత్తిడికి గురైన తివారీ తరచూ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు విమానాల్లో హైజాకర్లు వచ్చారని గతంలో రెండు సార్లు మేయిల్ పంపించాడు. మెయిల్ అందుకున్న ఎయిర్ పోర్టు అధికారులు వివామానాలను, ఎయిర్ పోర్టును అనువణువు తనిఖీ చేసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు. మెయిల్స్ నకిలీవని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు మెయిల్స్ పంపిన నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. తన ఉద్యోగం పోయిందనే ఒత్తిడి వల్లే మెయిల్స్ చేశానని నిందితుడు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News