Monday, December 23, 2024

‘నీ ఉద్యోగం ఊడగొడతా’.. ట్రాఫిక్ ఎస్సైపై యువకుడి వీరంగం

- Advertisement -
- Advertisement -

రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడు

మన తెలంగాణ, సిటీ బ్యూరో: ట్రాఫిక్ ఎస్సైపై యువకుడి వీరంగం యూసుఫ్‌గూడలో చోటుచేసుకుంది. బైక్ ఆపిన ఎస్సైపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ట్రాఫిక్ ఎస్సై యూసుప్‌గూడలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువకుడు బైక్‌పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వస్తుండగా ఎస్సై నరేష్ బైక్‌ను ఆపాడు. దీంతో రెచ్చిపోయిన యువకుడు తన బైక్‌కు చలాన్ రాస్తే నీ ఉద్యోగం ఊడగొడతా అంటూ నానా హంగామా చేశాడు. తాను సైకోనని, బండభూతులు తిడుతూ, తన గురించి పంజాగుట్ట పోలీసులను అడుగు తెలుస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. తనతో పెట్టుకుంటే నీ అంతు చూస్తానని హెచ్చరించాడు. దీంతో ఎస్సై నరేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు యువకుడిపై ఫిర్యాదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News