Sunday, December 22, 2024

కీచైన్‌లోని కత్తితో ఆర్టీసి డ్రైవర్‌పై యువకుడి దాడి

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్: ఆర్టీసి డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగిన యువకుడు తన దగ్గర ఉన్న కీచైన్‌లో ఉన్నచిన్నకత్తితో డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి ఓల్డ్‌బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందినషేక్‌నసిర్ (20) బ్యాండ్ వాయిస్తు కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. గురువారం నసీర్ సికింద్రాబాద్ పార్యడైజ్ నుంచి న్యూబోయిన్‌పల్లికి ఆర్టీసి బస్సులో ప్రయాణించాడు. బస్సులో ఎక్కిన నసీర్‌ను బస్సు కండక్టర్ ధనుంజయ్ టికెట్ తీసుకోవాలని నసీర్ కోరగా తన డ బ్బులు లేవని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్యన వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పటికే న్యూబోయిన్‌పల్లికి బస్సు చేరుకుంది. దీంతో నసీర్ కిందకు దిగాడు. బస్సు దిగిన డ్రైవర్ సోమనర్సయ్య (50) అతడిని నిలదీశాడు. దీంతో ఆగ్రహంతో నసీర్ తనవద్ద ఉన్న కీచైన్‌లోని చిన్నకత్తితో డ్రైవర్ సోమనర్సయ్య చేతిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News