Wednesday, January 22, 2025

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం: యువకుడితో పాదం నాకించుకున్న దుండగులు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లాలో ఒక యువకుడిని చితికబాది ఒక వ్యక్తి పాదాన్ని నాకించిన దారుణ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వేంగంగా వెళుతున్న వాహనంలో ఒక యువకుడిని ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడడం ఆ వీడియోలో వినిపించింది. దబ్రా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో బాధిత యువకుడు మైనారిటీ మతానికి చెందిన వ్యక్తని తెలుస్తోంది. ఒక పాత వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆ యువకుడిని గ్వాలియర్ కలెక్టర్ కార్యాలయం వద్దకు కొంరు వ్యక్తులు రప్పించినట్లు తెలుస్తోంది. అక్కడకు చేరుకున్న తర్వాత ఆ యువకుడిని వాహనంలో కూర్చోపెట్టుకుని దబ్రా వైపు వెళ్లినట్లు సమాచారం.

బాధిత యువకుడిని కొట్టి, తిట్టిన ఇద్దరు నిందితులను స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. కదులుతున్న వాహనంలో ఒక యువకుడిని దుర్భాషలాడుతూ కొట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మత్రి శనివారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News