Wednesday, January 22, 2025

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్ మండలంకు చెందిన జోడు లక్ష్మణ్ 28 అనే యువకుడు కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై డి.ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు లక్ష్మీ కుమారుడు లక్ష్మణ్, కోడలు రజితలకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

లక్ష్మణ్ హైదరాబాద్ లో డ్రైవింగ్ చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తల మద్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవని మృతుని తల్లి ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం భార్యభర్తలు పిల్లలతో కలసి లక్ష్మణ్ అత్తగారి ఊరు ఎక్కపల్లికి బోనాల పండుగకు వచ్చారు.

బుధవారం సాయంత్రం లక్ష్మణ్ తన తల్లికి ఫోన్ చేసి నేను చని పోతున్నానని తెలుపగా నువ్వెక్కడున్నావ్ అని తల్లి అడుగగా బొల్లారం గ్రామ శివారులో అని తెలిపాడని అలా ఎందుకు చేస్తున్నావ్ మేము వస్తున్నామని అనగానే ఫోన్ పెట్టేసాడని తల్లి తెలిపిందన్నారు.కొడుకు ఫోన్ చేసిన విషయం బంధువులకు తెలుపగా వారు గురువారం గాలి ంచగా ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడని పోలీసులకు ఆమె తెలిపిందన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News