Thursday, January 9, 2025

రణరంగం

- Advertisement -
- Advertisement -

ప్రియాంకగాంధీపై బిజెపి ఎంపి అనుచిత వ్యాఖ్యలు…ఆగ్రహించిన కాంగ్రెస్
కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ముట్టడి రాళ్లు,
కర్రలు, కోడిగుడ్లతో దాడి ఇద్దరు బిజెపి నాయకులకు గాయాలు రెచ్చిపోయిన
బిజెపి కార్యకర్తలు గాంధీభవన్ వైపు దూసుకెళ్లిన కమలదళం కాంగ్రెస్
కార్యాలయంపై రాళ్ల దాడి, ఫ్లెక్సీల చించివేత రోడ్డు మీదే బైఠాయించి నిరసన
ఇరు పార్టీల నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు

మన తెలంగాణ/నాంపల్లి: ఢిల్లీ బిజెపి ఎంపి రమే శ్ బిదూరి కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీపై చేసి న అనుచిత వ్యాఖ్యలపై ఇరు పార్టీ కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీం తో ఇరు పార్టీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతూ పరస్పర దాడులు, రాళ్లు రువ్వడం, ఫ్లెక్సీలు చించివేయడం, తోపులాటలు, దూషణలు, బైఠాయింపుల తో పరిస్థితి ఒక్కసారిగా రణరంగాన్ని తలపించా యి. పోలీసుల సమక్షంలోనే బారికేడ్లను తోసేసి, కొందరు అవతల వైపు దూకారు. బిజెపి ఆఫీస్, గాంధీభవన్ వద్ద పరస్పర దాడులకు దిగారు. ఈ సందర్భంగా ఇరు పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల కథనం …. బిజెపి నేత ప్రియాంక గాంధీపై అభ్యంతకర ప్రకటనకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలుత సుమారు 30 మంది కాంగ్రెస్ శ్రేణులు బిజెపి ఆఫీస్ ముట్టడి ముసుగులో పోలీసుల కళ్లు గప్పి దొడ్డిదారిన అక్కడికి చేరుకున్నారు. దుండగులు ఎ వరూ ఊహించనివిధంగా బిజెపి ఆఫీస్‌పై రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దుండగులు ముందుస్తు ప్ర ణాళిక ప్రకారం రాళ్లు,ఇటుకలు, కర్రలు, కోడి గుడ్లు తెచ్చుకుని ఒక్కసారిగా ఆఫీస్‌పై దండయాత్రకు యత్నించారు. పలు కార్లపై రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న పోలీసులు, బిజెపి నేతలు అడ్డుకుని వారితో తలపడ్డారు. ఇరు వర్గాలు ఆగ్రహం కట్టెలు తెంచుకుని యుద్ధ వాతావరణం తలపించింది.

బయటి నుంచి లోపలికి రాళ్ల దాడులకు దిగారు. లోపల ఉన్న బిజెపి నేతలు ఆనంద్‌కుమార్ గౌడ్, నందకుమార్ గాయాలతో రక్తసిక్తమయ్యారు. అక్కడే కాంగ్రెస్ దుండగుల దాడులను అడ్డుకునే యత్నంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, పలువురు బిజెపి నేతలు, అబిడ్స్ పిఎస్ ఇన్‌స్పెక్టర్ ఇమానుయల్ మొహం, చేతిపై గాయాలయ్యాయి. నిరసనకారులు ప్రధాని నరేంద్ర మోడి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే నరేంద్రమోడి దిష్టిబొమ్మను దహనం చేశారు. తర్వాత కొడిగుడ్లు, రాళ్లు, ఇటుకలు, కర్రలతో బిజెపి నేతలపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బిజెపి నేతలు ఎదురుతిరగడం, పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ దుండుగులు గాంధీభవన్ వైపు పరుగులు తీశారు. ఘర్షణ జరుగుతుండగా లోపల బిజెపి నేతలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు, బారికేడ్లను తోసుకుంటూ ఆయా ఆఫీస్‌ల వద్ద ఘర్షణ వాతవరణం నెలకొని పరిస్థితి వేడెక్కింది. కాంగ్రెస్ శ్రేణులు ముందుస్తు ప్రణాళిక ప్రకారం రాళ్లు, కర్రలు, కోడిగుడ్లను తీసుకొచ్చి ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారని బిజెపి నేతలు ఆరోపించారు. ఈ దాడులకు దిగిన పలువురు కాంగ్రెస్ నేతలను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గాంధీభవన్‌పై బిజెపి శ్రేణుల రాళ్లు దాడులు, ఫ్లెక్సీల చించివేతలు పరిస్థితి ఉద్రిక్తత
బిజెపి ఆఫీస్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడులు, గాయాల వంటి ఘటనలకు నిరసిస్తూ బిజెపి నాయకులు ఆగ్రహం, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ సుమారు 30 మంది పైగా శ్రేణులు బిజెపి ఆఫీస్ వద్ద నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు. మధ్యలో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని, బారీకేడ్లపైకి ఎక్కి అవతలకు దూకి పోలీసులను తోసేస్తూ గాంధీభవన్ వద్దకు చేరకున్నారు. సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. గాంధీభవన్ ప్రవేశ గేట్ వద్ద కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు చించివేశారు. లోపలికి చొరబడేందుకు యత్నించగా భద్రత బలగాలు అడ్డుకున్నారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు రావడం వారి మధ్య తోపులాటలు, వాగ్వావాదాలతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

పనిలో పనిగా బిజెపి శ్రేణులు గాంధీభవన్‌పైకి రాళ్లు విసిరారు.తర్వాత రోడ్డుమీదనే రాహుల్ గాంధీ జోకర్, బ్రోకర్, కాంగ్రెస్ ముర్దాబాద్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జియాది పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసుల అడ్డుకున్న బీజేపీ నేతలు ససేమిరా అన్నారు. రోడ్డుమీదనే బైఠాయించి తమ నిరసనను వెళ్లగక్కారు. పోలీసులను నచ్చచెప్పిన వినలేదు. దీంతో భద్రత బలగాలు నాలుగువైపులా వారిని చుట్టుముట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి తరలించారు. అనంతరం బిజెపి నేతలు డి.గోపాల్‌జీ, శేఖర్, గణేశ్ యాదవ్ తదితరులు బైక్‌లపై గాంధీభవన్‌కు వైపు వెళ్లేందుకు యత్నించగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాహుల్ గాంధీ 420 జోకర్, బ్రోకర్ : బిజెపి నేతలు
రాష్ట్ర బిజెపి ఆఫీస్‌పై కాంగ్రెస్ దుండుగల దాడులకు నిరసనగా సుమారు వంద మంది బిజెపి నేతలు ఆఫీస్‌లోంచి బయటికి వచ్చి గాంధీభవన్‌కు వెళ్లేందుకు యత్నించగా అక్కడే పోలీసులు బారికేడ్లు, తాళ్లతో వారిని అడ్డుకున్నారు. వారిని ముందుకు కదలనీయకుండా నిలిపేశారు. కాంగ్రెస్ గుండాలు బిజెపి ఆఫీస్‌పై దాడులకు తెగబడితే పోలీసులు ఏం చేశా రు. ఎందుకు అడ్డుకోలేదంటూ వారిని గట్టిగా నిలదీశారు. తమ పార్టీ నేతలపై రాళ్లు, కట్టెలతో కొట్టి గాయాలకు గురిచేశారు. మీరు అడ్డుకున్నారా ? ప్రశ్నించారు. మీ చేతకాని తనం వల్లనే ఉత్రిక్త పరిస్థితికి కారణమంటూ పోలీసులపై ఆగ్రహం వెళ్లగక్కారు. తర్వాత పార్టీ జెండాలు చేత పట్టుకుని, బిజెపి ఆఫీస్‌పై దాడి ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. 60+60 120 రాహుల్ గాంధీ 420. పప్పుఖాన్ ఎక్కడ దాకున్నాడు వియత్నంలో ఎంజాయి చేస్తున్నాడు. రాహుల్ గాంధీ జోకర్, ముర్ఖుడు, అసమర్దుడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే జియాది. కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News