Monday, December 23, 2024

జులై 11 నుంచి యూత్ కాంగ్రెస్ ప్లీనరీ

- Advertisement -
- Advertisement -
బిజెపి విధానాలపై ప్లీనరీలో చర్చిస్తాం : మానిక్ రావు థాక్రే

హైదరాబాద్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జులై 11, 12, 13 తేదీల్లో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మానిక్ రావు థాక్రే తెలిపారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు శివసేనారెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో థాక్రే మాట్లాడుతూ తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, జులై 11,12,13 తేదీల్లో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ జరగబోతుందని తెలిపారు.

దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. బిజెపి అనుసరిస్తున్న విధానాలపై యూత్ కాంగ్రెస్ ప్లీనరీలో చర్చిస్తామని థాక్రే అన్నారు. యూతన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిదని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన వారికి తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కరి చొప్పున పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఇంచార్జిలను నియమించబోతున్నామన్నారు. ఇప్పటికే 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను ఫైనలైజ్ చేసామని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు టిక్కెట్లు ఇస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయం మేరకు యువతకు అవకాశాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకులు, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పనిచేసిన యూత్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News