Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: కెసిఆర్ పాలనలో ప్రజలు తీవ్రంగా మోసపోయారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ పోరట యాత్ర శనివారం నిజామాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసి వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ వక్రీకరించిందని మండిపడ్డారు.

ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై గందరగోళం సృష్టించేందుకు బిఆర్ఎస్ నాయకులు దుర్బుద్ధిని ప్రదర్శించారని విమర్శించారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ మానసపుత్రిక అని, కాంగ్రెస్ అధికారంలోనే రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా యూత్ కాంగ్రెస్ పోరాట యాత్ర ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News