Tuesday, December 24, 2024

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

గంగారం: విద్యుదాఘాతంతో యువ రైతు మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గంగారం మండలం కొడిశెలమిట్ట గ్రామానికి చెందిన ఈసాల రాకేష్(28) తన పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో విద్యుత్ మోటారు పనిచేయకపోవడంతో ఫీజులు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు వైర్ తగలగడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రాకేష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గూడూరు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్లు తెలిపారు. కాగా మృతుని భార్య, కూతురు ఉంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై దిలీప్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News