Sunday, December 22, 2024

యువతతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివిధ దేశాలలో యువత జనాభా తగ్గుతోందని, మన వద్ద పుష్కలంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి నియామక పత్రాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యువతతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా ముందుకెళ్తున్నామని, మరో 25 ఏళ్ల పాటు మనకు అమృత కాలమని తెలియజేశారు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే దేశంలోకి పెట్టుబడులు రావని, తీవ్రవాదులను కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామని, విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, వ్యవసాయ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News