Monday, April 7, 2025

క్రికెట్ బెట్టింగ్.. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడి బలయ్యాడు. ఆదివారం సికింద్రాబాద్లో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుచిత్రలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్లో ఉంటున్న రాజ్వీర్సింగ్ ఠాకూర్.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో రైలు కింద సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News