- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో అమెజాన్ బిల్డింగ్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని హర్యానాకు చెందిన పర్వేజ్ (22)గా గుర్తించారు. విమానాశ్రయంలోని అమెజాన్ కంపెనీలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -