కోజికోడ్: కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని అథోలికి చెందిన 29 ఏళ్ల మెకానిక్ జుట్టు రాలిపోవడంతో మనోవేదనకు గురై తన ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కే. ప్రశాంత్ 2014 నుంచి కోజికోడ్ లోని ఓక్లినిక్ లో జట్టు రాలే సమస్యకు చికిత్స తీసుకున్నాడు. ఆ డాక్టర్ ఇచ్చిన మందులతో ప్రశాంత్ కనుబోమ్మలపై జట్టును సైతం కోల్పోయినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకూ ఇబ్బంది కావడంతో ప్రశాంత్ మానసికంగా కుంగిపోయి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రశాంత్‌కు హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలిపోయిందని కోజికోడ్‌లో అతనికి చికిత్స చేసిన డాక్టర్ తెలిపారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ జుట్టు సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే.