Thursday, January 23, 2025

యువజన ఉత్సవాలను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

ములుగు : నెహ్రూ యువ కేంద్రం వరంగల్ వారి ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడా కార్యాలయం ములుగు వారు సంయుక్తంగా జిల్లాలో ఈ నెల 14న సోషల్ వెల్ఫేర్ జాకారం గ్రౌండ్‌లో ఆజాద్‌కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే యువజన ఉత్సవాలను విజయవంతం చేయాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యువ ఉత్సవ్ బ్రోచర్ విడుదల చేస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత ఈ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ చూపి దేశస్థాయి వరకు జరిగే పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి అన్వేష్, ఆర్‌డిఓ రమాదేవి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ప్రేమలత, జిల్లా యువజన క్రీడా అధికారి పివిఆర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News