Monday, March 3, 2025

హోటల్‌లో ఉరివేసుకుని యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఓ హోటల్‌లో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కరీంనగర్ జిల్లాకు చెందిన పి. సాయికుమార్(28) గురువారం నగరానికి వచ్చాడు. ఎర్రగడ్డలోని సన్మాన్ హోటల్‌లో రూమ్ తీసుకుని ఉన్నాడు. అయితే శుక్రవారం రాత్రి నుంచి సాయికుమార్ హోటల్ గది నుంచి బయటికి రావలేదు.

క్లీనింగ్ చేసేందుకు హోటల్ సిబ్బంది డోర్ కొట్టినా కూడా సాయికుమార్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపు తీసి చూశారు. సిబ్బంది చూసేసరికి సాయికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే హోటల్ సిబ్బంది బోరబండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News