Monday, January 20, 2025

బిజెపిలో చేరిన వివిధ పార్టీలకు చెందిన యువకులు

- Advertisement -
- Advertisement -
జాతీయ మహిళా మోర్చా నాయకులు పద్మ ఆధ్వర్యంలో చేరికలు

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు పలువురు యువకులు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మ వీరపనేని సమక్షంలో ఆదివారం యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్‌లకు చెందిన 300 యువత చేరారు. వారికి హైదరాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గౌతమ్ రావు బీజీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాన మంత్రిగా చూడాలని యువత బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అధికార పార్టీ గత ఎన్నికల్లో గ్రేటర్ నగరానికి ఇచ్చిన హామీలను అమలు చేసిన నగరాభివృద్దికి పాటు కృషి చేయాలని సూచించారు. అనంతరం డా.పద్మ వీరపనేని ప్రసంగిస్తూ బిజెపి సిద్ధాంతాలు నచ్చి అన్ని డివిజన్ లలోని యువతీ యువకులు పార్టీ లో చేరారని, గత తొమ్మిది సంవత్సరాల నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు పాలకులు గాలికి వదిలేశారని అన్నారు. వరదలతో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం లేదని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, సయ్యద్ ఫైజల్, బుజ్జిబాబు, సురేష్, శ్రీనివాస్ రాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News