Wednesday, January 22, 2025

బాలికను వేధించిన యువకుడికి మూడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించాలని బాలకను వేధింపులకు గురి చేసిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.16,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…మేడ్చెల్ జిల్లాకు చెందిన కొండం ప్రేమ్‌కుమార్ బాలికను ప్రేమిస్తున్నానని రెండు నెలల నుంచి వేధిస్తున్నాడు. వెంబడించడమే కాకుండా వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు, ఫోన్ చేస్తున్నాడు.

తాను చెప్పినట్లు వినకుంటే ఫొటోలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అక్టోబర్ 14,2017న బాలిక ఇంటికి వచ్చి తనతో రాకుంటే చంపివేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టు సాక్షాలు ప్రవేశపెట్టగా కోర్టు తీర్పు చెప్పింది. ఎస్సై నాగరాజు కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News