Sunday, April 6, 2025

చనిపోయిన ప్రేయసిని పెళ్లాడిన యువకుడు..

- Advertisement -
- Advertisement -

 

మోరిగావ్: చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడి ఇక జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోనని ఓ యువకుడు శపథం చేసిన సంఘటన అసోంలోని మోరిగావ్ జిల్లాలో చోటుచేసుకుంది. మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడపలనుకున్నారు. ఇటీవల అనారోగ్యం బారినపడి ప్రియురాలు చనిపోయింది. ప్రేయురాలి మరణ వార్త విని తట్టుకోలేకపోయిన యువకుడు ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. మృతదేహానికి తాళి కట్టాడు. ఇకపై ఎవరినీ పెళ్లి చేసుకోబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ అని ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News