నాగర్‌కర్నూల్: యువత మత్తు పదార్థాలు వీడి భవిష్యత్తును సుందరవంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్ కోర్టు న్యాయమూర్తి డి. రాజేష్ బాబు అన్నారు. సోమవారం పాలెం గ్రామంలోని వ్యవసాయ కళాశా ల సభ మందిరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగంలో జరిగే అనర్థాలపై యువతకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి. రాజేష్ బాబు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి జి. సబి త, జిల్లా అదనపు ఎస్పి రామేశ్వర్‌లతో కలిసి ప్రత్యక్షంగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంలో జరిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించారు. ఒక దేశాన్ని కానీ సమాజాన్ని కానీ విచ్ఛిన్నం చేయడానికి, అభివృద్ధి చేయడానికి మొదటగా యువతపై ప్రయోగిస్తారని ప్రస్తుత ం యువత గ్రామాలలో, పట్టణాలలో మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారన్నారు. ముందుగా సరదాకు వినియోగించిన మత్తు రాను రాను అలవాటుగా మారి బానిసలవుతూ భవిష్యత్తు లక్షాల ను మర్చిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సబిత మాట్లాడుతూ మానసికంగా నిలదొక్కుకుని మత్తు అలవాట్లకు దూరంగా ఉండాలంటూ యువతకు సూచించారు. ఈ మత్తు పదార్థాలు మెదడుపై ప్రభావం చూపి వాళ్లు ఏం చే స్తున్నారన్నది కూడా తెలియని మానసిక స్థితికి దిగజార్చి బంధువులను, స్నేహితులను, మంచి జీవితా న్ని దూరం చేస్తుందన్నారు. జిల్లా అదనపు ఎస్పి రామేశ్వర్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై తప్పుదారిలో వెళ్లి నేరాలకు పాల్పడితే కేసులతో ఎ ఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లైతే యువత భవిష్యత్తును కోల్పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశా ల ప్రిన్సిపల్ పద్మావతి, సీనియర్ న్యాయవాదులు శ్యాం ప్రసాద్ రావు, రామ చందర్, మధుసూదన్ రావు, కళాశాల విద్యార్థి విద్యార్థులు, కోర్టు సిబ్బ ంది, కేశవ రెడ్డి పాల్గొన్నారు.