Thursday, December 26, 2024

బాలికకు రంగులు పూశాడని యువకుడిని చావబాదారు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తమ గ్రామానికి చెందిన బాలికకు రంగులు పూసినందుకు ఆగ్రహించిన కొందరు యువకులు ఒక యువకుడిని కిడ్నాప్ చేయడంతోపాటు అతడిని నగ్నంగా నిలబెట్టి చితకబాదారు. మార్చి 8వ తేదీన హోలీ సందర్భంగా జరిగిన అ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నాటకలోని కోలార్ పట్టణంలోని బెలమరనహల్లిలో నివసించే మధు అనే యువకుడు హోలీ పండుగ నాడు బస్సులో వెళుతున్న ఒక బాలికకు రంగులు పూశాడు. తమ గ్రామానికి చెందిన బాలికకు రంగులు పూయడం పట్ల ఆగ్రహం చెందిన కొందరు యువకులు మధును తమ గ్రామానికి పిలిపించారు. పిలిచింది తనకు తెలిసిన వ్యక్తులే కావడంతో మధు వారి గ్రామానికి వెళ్లాడు.

అక్కడ మధును ఆ యువకులు బాలికకు రంగులు ఎందుకు పూశావని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అతడిని ఒక రేకుల షెడ్డులో బంధించారు. బట్టలు విప్పించి మధును చావబాదారు. తీవ్రంగా గాయపడిన మధు ఆసుపత్రి పాలయ్యాడు. విషయం తెలుసుకున్న వేగల్ పోలీసులు మధును కొట్టిన యువకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News