Saturday, December 21, 2024

మీర్‌పేట్‌లో దారుణం.. బీరు బాటిళ్ల కోసం యువకుడి హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీర్ బాటిళ్ల కోసం యువకుడిపై నలుగురు యువకులు దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడలో నిన్న(సోమవారం) రాత్రి చోటుచేసుకుంది. సాయివరప్రసాద్ అనే యువకుడు మద్యం దుకాణం నుండి బీరు బాటిళ్లు కొని తీసుకెళ్తుండగా నలుగురు యువకులు అడ్డుపడి తమకు బీరు బాటిళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీరు బాటిళ్లు ఇవ్వకపోవడంతో కోపంతో సాయిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News