Sunday, September 22, 2024

యువకుడి ప్రాణాలు తీసిన లవ్ ఎఫైర్

- Advertisement -
- Advertisement -

Minor Offenders for Luxuries

 

గాంధీనగర్: లవ్ ఎఫైర్ ఓ యువకుడి ప్రాణాలు తీసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా రాపార్‌లో జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కంజి రాథోడ్ అనే యువకుడు హితేష్ గోయల్(23) చెల్లితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. తన చెల్లితో ప్రేమ దోమ అని తిరుగుతే బాగుండదని రాథోడ్‌ను హితేష్ బెదిరించాడు. రాథోడ్‌లో ఎటువంటి మార్పు లేకపోవడంతో దావత్ ఉందని రాథోడ్‌ను హిత్‌ష్ పిలిచాడు. గ్రామ శివారులో రాథోడ్‌ను తీసుకెళ్లి అనంతరం అతడిపై హితేష్ కత్తితో గొంతు కోశాడు. రాథోడ్ చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు రాపార్ పోలీస్ అధికారి ఆర్‌ఎం వాసవ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాథోడ్ తమ్ముడు అమర్ సింహ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

 

Youth killed over with love affair in Gujarath

 

Youth killed over with love affair in Gujarath
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News