Friday, December 27, 2024

కీసరలో యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Youth Murdered by Unknown in Keesara

మేడ్చల్: జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ఘటన చోటుచేసుకుంది. గోధుమకుంటలో ఓ యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి కిరాతకంగా కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు యాదాద్రి మండలం సైదాపురం వార్డ్ మెంబర్ బాలరాజు గౌడ్(36)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Youth Murdered by Unknown in Keesara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News