Saturday, December 21, 2024

మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 17ఏళ్ళ యువకుడిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపారు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలోకి యువకుడిని తీసుకెళ్లిన దుండగులు హత్య చేశారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. మృతి చెందిన వ్యక్తిని బిహార్ కు చెందిన రాజా పాశ్వాన్ గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బిహార్ కు చెందిన వారితో పాశ్వాన్ కు గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. గొడవపడిన వారే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News