Thursday, January 23, 2025

పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియురాలుపై అత్యాచారం… వీడియోలతో బ్లాక్ మెయిల్

- Advertisement -
- Advertisement -

Mass rape of a Minor girl in Chhatrinaka

ముంబయి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియురాలిపై ప్రియుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సరాజ్ సరదేశాయ్ అనే యువకుడు కాలేజీలో ఉండగా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఒక రోజు ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెకు తెలియకుండానే వీడియో తీశాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడు. గత వారం పబ్లిక్ ఆమెను కౌగిలించుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. గతంలో ఆమె పెళ్లి చేసుకుంటానని అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చదువు మీద శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News