Monday, December 23, 2024

కేపీహెచ్​బీ కాలనీలో కారు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

youth rash driving and misbehave with Girls in KPHB

హైదరాబాద్: కేపీహెచ్​బీ కాలనీలోని రోడ్ నంబర్ 3లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారును మద్యం మత్తులో అతివేగంగా నడుపుతూ యువకులు వీరంగం సృష్టించారు. అంతేకాకుండా హాస్టల్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో గమనించిన స్థానికులు కారును నిలిపివేసి యువకులను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తమ అదుపులో ఇద్దరు యువకులు, పరారీలో మరికొందరు యువకులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కారులో మద్యంసీసాలు, కండోమ్ లు, చాక్లెట్లు లభ్యమయైనట్టు సమాచారం. మద్యం మత్తులో యువకులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకుని యువ‌కుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News