Sunday, January 12, 2025

నంద్యాలలో దారుణం.. బాలికకు నిప్పంటించిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది.. బాలికకు నిప్పంటించిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో చోటుచేసుకుంది. నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో సజీవదహనమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు సమాచారం ప్రకారం.. వెందుర్తి మండలానికి చెందిన లహరి తన తండ్రి చనిపోవడంతో.. బైరెడ్డి నగర్‌లోని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో తన తాతయ్యకు చెప్పింది. దీంతో యువకుడిని బాలిక తాతయ్య మందలించాడు.

ఈ క్రమంలో కోపం పెంచుకున్న యువకుడు ఆదివారం.. బాలిక ఇంటికి వెళ్లి.. నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ యువకుడిని పట్టుకుంది. ఈ ఘటనలో బాలిక సజీవదహనం కాగా.. నిందితుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక, చదవుకోవడానికి వచ్చిన మనవరాలు మృతి చెందడంతో.. బాలిక అమ్మమ్మ, తాతయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News