యువకుడి ఘాతుకం.. పరుగులు తీసిన సర్పంచ్, సిబ్బంది
భిక్కనూర్ : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆగ్రహంతో ఓ యువకుడు సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి పె ట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు యత్నించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా, భిక్కనూరు మండలం, సిద్దిరామేశ్వర నగర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెం దిన తాము ఎన్ని రోజులు గుడిసెలో ఉండాలి.. ఇం కా డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయరా అంటూ గంధం రంజిత్ అనే యువకుడు గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్‌పై అరుస్త్తూ గొడవకు దిగాడు.
గత ప్రభుత్వంలో గ్రామంలో కొంతమందికి మాత్ర మే ఇల్లు మంజూరయ్యాయని, నీకు కూడా వస్తుందని.. ఓపిక పట్టాలని సర్పంచ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎంతకీ రంజిత్ వినకుండా బూతుమాటలతో తిడుతూ హంగామా సృష్టించాడు. ఆ తరువాత పెట్రోల్ డబ్బాతో అక్కడికి వచ్చి పంచాయతీ కార్యాలయంలో సీట్లో కూర్చున్న సర్పంచ్‌పై, కార్యాలయంలో పెట్రోల్ పోసి నిప్పటించాడు.
ఈ హఠాత్ పరిణామంతో సర్పంచ్ పాటు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కార్యాలయంలో ఉన్న ఫైల్స్ తోపాటు టేపాటు, కుర్చీలకు నిప్పు అంటుకోవడంతో వెంటనే ఫైళ్లను బయటకు తీసుకువచ్చి నీళ్లు పోసి చల్లార్చారు. ఈ క్రమంలో రంజిత్ సర్పంచ్‌ను చంపేస్తానని బెదిరించాడు. వెంటనే సర్పంచ్, జిపి సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.