- Advertisement -
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ కట్టాలని పోలీసులకు ఆపడంతో ఆగ్రహం చెందిన యువకుడు తన బైక్‌కు నిప్పు పెట్టిన సంఘటన శంషాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఫసియుద్దిన్ అనే యువకుడు తన హోండా యాక్టివాపై వెళ్తున్నాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు ఫసియుద్దిన్‌ను ఆపారు. బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు కట్టాలని కోరారు. దీంతో పోలీసులను దుర్బాషలాడిన ఫిసియుద్దిన్, ఆగ్రహంతో తన బైక్‌కు నిప్పు అంటించాడు. వెంటనే స్పందించిన పోలీసులు మాంటలను ఆర్పివేశారు.
- Advertisement -