Monday, December 23, 2024

యువతను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: యువతను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒలంపిక్ డే రన్ 2023 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని విద్యార్థినీవిద్యార్థులు, యువకులు, మహిళలు, పి ఇటిలు, క్రీడా సంఘాల బాధ్యులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ ఒలంపిక్ డే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని జిల్లాకు ఖ్యాతిని తీసుకురావాలన్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడా అభివృద్ధి అధికారి డాక్టర్ బోనగిరి నరేష్ మాట్లాడుతూ జిల్లా ఒలంపిక్ డే రన్ 2023 మాత్రమే కాకుండా జిల్లాలో నిర్వహించే క్రీడా కార్యక్రమాలు ఏవైనా విజయవంతం చేసేందుకు శాఖ తరుపున సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ, జిల్లా పెటా అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, పిడిలు, పిఇటిలు హరిరామ్, కృష్ణ ప్రసాద్, రవి, రామ్‌నాయక్, కోటేశ్వర్‌రావు, అజయ్‌బాబు, వేణు, గంగాదర్, సుధాకర్, శ్రీనివాస్, శ్రీరామ్, మంగ, ధర్షిక, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News