Saturday, November 23, 2024

యువతే రాజకీయాలను ప్రక్షాళన చేయాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: యువతే రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, అందు కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎండి రియాజ్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటిషన్ పై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎండి రియాజ్ హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో నానాటికి విలువలు పడిపోతున్నాయని, వాటిని గాడిలో పెట్టి సమాజాన్ని బాగు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, అందుకు యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటిషన్ పోటీలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు.

కాంగ్రెస్ నాయకులు బట్టు కరుణాకర్ ప్రొఫెసర్ రియాజ్‌కు శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, దబ్బెట రమేష్, సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, నగునూరి రజినీకాంత్, యూత్ నాయకులు ప్రేమ్, సురేష్, మహేష్, ఉదయ్, వినయ్, కార్తీక్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News