Wednesday, January 22, 2025

యువత పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి

- Advertisement -
- Advertisement -
  • జడ్పీ చైర్ పర్సన్ సునితామహేందర్ రెడ్డి

వికారాబాద్ : యువత పరిశ్రమలను స్థాపించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ పి.సునీతా మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా లబ్ది పొందిన లబ్దిదారులు ట్రాక్టర్లు, ఆటోలు ఇతర వాహనాలతో బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి సభాస్థలికి పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.

తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలను వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి తేజ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పి చైర్ పర్సన్ పి.సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యువతను పారిశ్రామిక రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని అన్నారు. మహిళలు కూడా పరిశ్రమల ఏర్పాట్లు ముందు భాగాన ఉండాలని ఆమె సూచించారు. రైతులు వికారాబాద్ జిల్లాలో వర్షాధార పంటలపై ఆధారపడి ఉంటున్నారని, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకొనేలా వ్యవసాయ అధికారుల సలహా సూచనలు తీసుకోవాలని ఆమె సూచించారు. యువత తమ సమయాన్ని వృధా చేయకుండా చిన్న ఉద్యోగమైన, వ్యాపారమైన చేసుకొని ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి తోడ్పాటుగా ఉండాలని ఆమె కోరారు.

వికారాబాద్ జిల్లా వెనుకబడి జిల్లా కాకుండా పరిశ్రమల పరంగా ముందంజలోకి వెళ్దామని ఆమె అన్నారు. చాలా మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకొని గృహాలు నిర్మించుకుంటున్సారని అలా కాకుండా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను పొంది చిరు వ్యాపారాలు చేసుకుంటూనే ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. పెద్ద పరిశ్రమలు స్థాపించుకొని ఎదిగిన పారిశ్రామికవేత్తలు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని చైర్ పర్సన్ కోరారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వయంకృషి , పట్టుదల కసితో పని చేస్తే ఏదైనా సాధ్యమన్నారు. ఎలాంటి పనినైనా తమకు ఇష్టంగా మలుచుకొని పనిచేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుందని కలెక్టర్ అన్నారు. పారిశ్రామిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వమే ప్రోత్సాహం కల్పిస్తుందని దీని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చట్టాన్ని తీసుకొని వచ్చి నిర్ణీత కాలంలో మన ఇంటికి అన్ని విధాల అనుమతులు రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల రాయితీలనిస్తూ పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో పారిశ్రామికంగా ఎదిగి పటిష్టంగా ఉంటే మన పిల్లలు కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా సహాయం పొంది ఆర్థికంగా ఎదుగుతున్న వ్యాపారులు యువతకు మంచి సందేశాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.

ఈ ఉత్సవాల్లో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ , జడ్పీ వైస్ చైర్మన్ బి విజయ్ కుమార్ , పరిశ్రమ శాఖ జిల్లా మేనేజర్ వినయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, బంట్వారం జెడ్పిటిసి సంతోష, వీఆర్వో అశోక్ కుమార్ వికారాబాద్ ఆర్డిఓ విజయ్ కుమారి, డిక్కీ సంస్థ జిల్లా అధ్యక్షులు చైతన్య, ఇడిస్ట్రిక్ట్ మేనేజర్ మహేశ్వరంలతో పాటు జిల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ బ్యాంక్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఐ పాస్ కింద లబ్ధి పొందిన శంకర్ , సురేష్, అనిల్ కుమార్, మహ్మద్ ఖాజా, నర్సింలు, బామిని సుజాత హరిహర రెడ్డి, కాజా మొహిద్దిన్ ఎమ్మెస్ ప్రసాద్ లు తమ ఆర్థిక పరిస్థితుల మెరుగుపై ప్రస్తావిస్తూ.. తమ ఎదుగుదలకు సహకరించిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం వివిధ పరిశ్రమల యాజమాన్యాలకు మెమొంటోళ్లను అందించి ప్రశంస పత్రాలను అందజేశారు. అదేవిధంగా జిల్లాలో పరిశ్రమల రంగానికి తోడ్పాటునందిస్తున్న ఐటీ అండ్ సి సిబ్బంది వెంకటేష్, బాబేష్ , ఉమాశంకర్, గోపాల్ లతో పాటు మీసేవ, ఆధార్ కేంద్రాల నిర్వాహకులు నరసింహులు, ఎంవి ప్రసాద్, జి మాధురీ లకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News