Sunday, December 22, 2024

యువత స్టార్టప్‌లతో ముందుకు రావాలి: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కట్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

హైదరాబాద్: యువత స్టార్టప్‌లతో ముందుకు వచ్చి మరింత మందికి ఉపాది కల్పించాలని, వారికి ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలు ఇస్తుందని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి టిఎన్జీవోస్ కాలనీ ఫేజ్ 2, రోడ్డు నంబర్ 3లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ కట్స్(స్టార్టప్)ను ఆదివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో శాసనమండలీ మాజీ చైర్మన్ స్వామిగౌడ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవాలన్నారు. నాణ్యమైన నాన్‌వెజ్‌ను అందించడమే తమ లక్షమని వ్యవస్థాపకులు కిరణ్ రెడ్డి, హరిప్రసాద్ గౌడ్ అన్నారు. ముందు ముందు మరిన్ని నాన్‌వెజ్ ఐటెంలు అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని బ్రాంచులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News