Wednesday, January 22, 2025

యువత రాజకీయాల్లోకి రావాలి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం అసన్నమైందని రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అద్యక్షులు డాక్టర్ బల్మూరు వెంకట్ అన్నారు. యువత రాజకీయంగా ఎదగడానికి ఎన్‌ఎస్‌యూఐ చక్కటి వేధికని ఆయన పేర్కోన్నారు. రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటేషన్‌లో విద్యార్థులు, యువకులు భాగస్వాములు కావాలని ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అద్యక్షులు షేక్ రియాజ్ అద్యక్షతన డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిధిగా పోరిక బలరాం నాయక్‌తో పాటు ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా, మండలాలు, పట్టణ కమిటీల పనితీరును పర్యవేక్షించారు. రాబోవు ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కోన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు క్రియశీలంగా పనిచేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్‌గాంధీ క్విజ్ కాంపిటేషన్ అంశంపై ముఖాముఖిగా మాట్లాడి దాని విధి విధానాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో పార్టీ శ్రేణులకు ధీటుగా ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ హెచ్చు వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గుగులోతు వంశీనాయక్, తుళ్ల ప్రణయ్, జవహర్ బాల్ మంచ్, పిట్టల నవీన్, చంటి స్వామి, నర్సింగ శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్, సందీప్‌రెడ్డి, నమోజ్, సమీర్, రాకేశ్, తరుణ్‌నాయక్, సాగర్, రాజీవ్, దీపక్, రాజేందర్, భరత్ నాయక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News