Wednesday, December 25, 2024

యువత రాజకీయాల్లోకి రావాలి

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా ప్ర తినిధి : యువత రాజకీయాల్లోకి రావాలని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అ న్నారు. యువజన కాంగ్రెస్ 63 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ఎదుట యు వజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బా నోత్ రవిచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే సీతక్క బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై మహత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, యవజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్‌చేసి యూత్ అధ్యక్షునికి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని అన్నారు. దేశ జనాభాలో యువకుల శాతమే అధికంగా ఉందని తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో యువత కీలకపా త్ర పోషించాలని తెలిపారు.

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీలు యువతను నట్టేట ముంచిన పరిస్థితి ఉందని, మాయ మాటలు చెప్పి యువకులను మోసం చేసిన మోడీ, కేసిఆర్ లను గద్దె దింపాలని అన్నారు. గృహలక్ష్మి పథకం గడువును పొడగించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం హడావిడిగా గృహలక్ష్మి తీసుకువచ్చి ప్రజలు మీ సేవ వద్ద పడిగాపులు కా స్తున్న పరిస్థితి ఉందని గడువు పొడగించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News