Monday, January 27, 2025

యవత అన్ని రంగాల్లో రాణించాలి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత అన్ని రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో జిల్లా స్థాయి యవ ఉత్సవ్. 2023 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ , జిల్లా సహాయ కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతరం నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లోనూ ప్రగతిని, ప్రతిభను చాటి ముందుకు సాగాలని తెలిపారు. ఓటమికి భయపడి వెనుకడుగు వేయవద్దని ధైర్యంతో మందడుగు వేయాలన్నారు. తమ ప్రతి అడుగు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.

సహాయ కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. యువతలో దాగి ఉన్న కళానైపుణ్యాలను వెలికితీసేందుకు నెహ్రూ యువ కేంద్ర యువ ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు ప్రారంభించి తిలకించారు.

పాంచ్ ప్రాణ్ సూత్రాలపై ఐదు అంశాలపై యువతకు పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో. అర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సురనేనిన, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మైన్ ఫరీద్, మార్నేని వెంకన్న, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎంపీపీ చంద్రమోహన్, ఎన్‌ఎస్‌ఎస్ కన్వీనర్ శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకులు గోగుల రాజు, డౌలాగర్ శంకర్, కర్పూరపు గోపీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News