Wednesday, January 22, 2025

యువకులు క్రీడల్లో రాణించాలి

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి

మేడ్చల్: యువకులు క్రీడల్లో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు గొప్పపేరు తీసుకురావాలని గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మైసమ్మగూడ గ్రామానికి చెందిన సుంకరి వంశీకృష్ణ జ్ఞాపకార్ధం కుటుంబసభ్యులు గుండ్లపోచంపల్లిలోని సరస్వతీ మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో 10 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో మైసమ్మగూడ, గుండ్లపోచంపల్లి జట్లు తలపడగా విజేతగా గుండ్లపోచంపల్లి జట్టు నిలిచింది. విజేతలకు మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ వంశీకృష్ణ తల్లిదండ్రులు సునీత, శ్రీనివాస్‌లతో కలిసి విజేతలకు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా మద్దుల లక్ష్మీ మాట్లాడుతూ వంశీకృష్ణ మన మధ్యలో లేకపోయిన కుమారుడికి ఇష్టమైన క్రికెట్ పోటీలు నిర్వహించి క్రీడాకారులలో తమ కుమారుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మిగతా క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించడం గొప్ప విషయమని సుంకరి శ్రీనివాస్ సునీత లను అభినందించారు.

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు బండారి దుర్గేష్, బండారి శ్రీనివాస్, బండారి కుమార్, బండారి రాజు, క్రీడాకారులు నరేష్, మనీష్, దొడ్ల రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News