Monday, December 23, 2024

యువత క్రీడల్లో రాణించాలి, క్రీడా స్ఫూర్తితో లక్ష్యాలు చేరుకోవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  యువత క్రీడా నైపుణ్యాన్ని పెంచుకుంటూ,క్రీడల్లో రాణించి దేశ ఔన్నత్యానికి పాటుపడాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సంక్రాంతి సంబరాలలో భాగంగా సిర్పూర్ మండల పరిధిలోని డోర్పల్లిల్లో డా.బి.ఆర్ అంబేడ్కర్ మోమోరియల్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు.

గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు లేకున్నా స్థానిక క్రీడాకారులు చెరువునే క్రీడా మైదానంగా మార్చుకొని క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. క్రీడలు స్నేహాభావని పెంపొందించి,శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమన్నారు. స్థానిక యువతతో కాసేపు క్రికెట్ ఆడి వారిలో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. మొదటి బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలతో పాటు మెమెంటోలు అందజేస్తమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అర్షధ్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు, నాయకులు జాడి శ్యామ్ రావు, రాజ్ కుమార్,రాం ప్రసాద్, అమ్మ శ్రీకాంత్, రజినీకాంత్ , అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News