Wednesday, January 22, 2025

యువత శారీరక ధృడత్వంపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: యువత శారీరక ధృడత్వంపై దృష్టి సారించాలని, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి ఐటీఐ నుంచి జెండా చౌరస్తా, కమాన్ మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, ఏసీపీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకొని పదవ ఏట అడుగు పెడుతున్న నేపథ్యం లో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతను భాగస్వామ్యం చేస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహిస్తున్నామన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దే శంలోనే మన పోలీస్ వ్యవస్థను అగ్రగామిగా తీర్చిదిద్దామని ఆయన అన్నారు. శాంతి భద్రతలతోనే రాష్ట్రంలోకి భారీగా నిధులు వస్తు న్నాయని ఆయన ప్రశంసించారు. నేడు సాధించిన ప్రగతి ఎంతో అద్భుతమని గ్రామాల స్వరూపం మారిపోయిందని, నీటి కష్టాలు తొల గిపోయాయన్నారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత ఫిట్ నెస్‌పై దృష్టి సారించేలా ప్రోత్సహించడం జరుగు తుందని తెలిపారు. శారీరక ధృడత్వంతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. దీని వల్ల జీవితంలో ఏర్పాటు చేసుకున్న లక్షాలకు ఉపయోపగడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసరి మమత, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ మహేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా మత్యశాఖ అధికారి భాస్కర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News