Monday, December 23, 2024

యువత శారీరక ధృడత్వంపై దృష్టి సారించి ఆరోగ్యంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ తెలంగాణ 2కె రన్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. మెదక్ నియోజక వర్గానికి సంబందించి మెదక్ పట్టణంలోని స్థానిక రాందాస్ చౌరస్తా నుండి ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పి రోహిణి ప్రియదర్శిని లు జెండా ఊపి ప్రారంబించారు. ఈ రన్‌లో పోలీసులు, జిల్లా అధికారులు, సిబ్బంది, యువజన సంఘాలు, యువత, విద్యార్థిని,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. .అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసినకార్యక్రమంలో గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ టరన్స్ 10 భంగిమలో విద్యారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకర్షించాయి. ఎంతో హుషారుగా ఎమ్మెల్యే, కలెక్టర్,ఎస్పీ లు చేసిన నృత్యాలు చేసి అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈ 9 ఏండ్లలో అన్ని రంగాలలో ఎంతో ప్రగతిని సాధించుకున్నామన్నారు. యువత శారీరక దృఢత్వం పై దృష్టి సారించి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని, ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఇటీవల సీఎం కప్పు కూడా నిర్వహించుకున్నామని అన్నారు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని యువతకు క్రీడలు వ్యాయాయం పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నామని అన్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఫలాలు అందుకునే దిశగా యువత దృఢంగా ఆరోగ్యంగా ఉండాలని, శారీరక దృఢత్వం సాధించగలిగితే మానసిక ప్రశాంతత లభిస్తుంద ని అన్నారు. తద్వారా నిర్దేశించుకున్న లక్ష్యసాధన సు లువు అవుతుందని అన్నారు. దశ్శాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంతవరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆఫీకార్ల భాగస్వామ్యంతో విజయవంతమయ్యాని, 22 వరకు జరిగి మిగతా కార్యక్రమాలలో ఇదే స్ఫూర్తితో పాల్గొనాలని కోరారు. ఎస్పి రోహిణి ప్రియదర్శి ని మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పించిందని, నేడు దేశంలోని మన పోలీసు వ్యవస్థను అగ్రగామిగా నిలిపిందని అన్నారు తద్వారా అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సైదులు, ఆర్‌డిఓ సాయి రామ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, సిఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, యువత,విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News