Thursday, December 26, 2024

యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల మైదానం నుండి బాయ్స్ గ్రౌండ్ వరకు ర్యాలీ జరిగింది. డ్రగ్స్‌కు యువత బానిస కావద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా అడిషనల్ ఎస్పి షాకీర్ హుస్సేన్ యువతకు సూచించారు. డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలని, ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు.

డ్రగ్స్‌కు అలవాటు పడి తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలుంటాయని అన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదన్నారు.

పోలీస్ శాఖ జిల్లాలో డ్రగ్స్, గంజా నివారణ పట్ల యువతకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2023 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో గంజాయికి సంబంధించి 1 కేసు నమోదు అయ్యిందని, దీనిలో ఒకిరిని అరెస్టు చేయడంతో పాటు 200గ్రా. గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News