Sunday, December 22, 2024

యువత ఉన్నత స్థాయికి ఎదగాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత అన్ని రం గాలలో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణ ంలోని వైఎస్‌ఎన్ గార్డెన్లో మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత లైసెన్స్ పంపిణీ కార్యక్రమానికి యువత భారీగా తరలి రావడంతో వైఎస్‌ఎన్ గార్డెన్ జన సంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరై ఉచిత లైసెన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతరం నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లో నూ ప్రగతిని, ప్రతిభను చాటి ముందుకు సాగాలని తెలిపారు.ఓటమికి భ యపడి వెనుకడుగు వేయవద్దని ధైర్యంతో మందడుగు వేయాలన్నారు. తమ ప్రతి అడుగు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ యువతకు మహేంద్ర యువసేన ఎల్లవేళలా అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో కెసిఆర్ నాయకత్వంలో యువత బాగుపడే విధంగా అనేక కార్యక్రమాలను మహేంద్ర యువసేన నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆలేరు నియోజకవర్గం లోని 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు లైసెన్సులు పొంది చిన్నతనం నుండి సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ,నియోజకవర్గ వ్యా ప్తంగా భారీ సంఖ్యలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News