Sunday, January 19, 2025

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఆదేశాలమేరకు మెదక్ పట్టణంలోని వెలుగు వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో శనివారం విద్యార్థులకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో షీ టీమ్, యాంటీ ఉమెన్ ట్రాఫిక్ యూనిట్ సంబంధించిన అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల జరిగే అనర్థాల గురించి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రత నిబంధనలు, ప్రేమ వివాహాలు వంటి అనర్థాలు, పోలీస్ చట్టాల గురించి విద్యార్థులకు తెలియచేశారు.

ఈ సందర్భంగా కళాబృందం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయస్సులో ప్రేమపట్ల ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఉన్నత చదువులు చదివి తమ కన్నవారి కలలు నెరవేర్చాలని అలాగే సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అపరిచిత వ్యక్తులు కాల్ చేసిమీకు లాటరీలు తగిలాయి. మీ లోన్స్ ఇస్తామని, తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు జరుగుతాయని కాబట్టి అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులపట్ల అనుమానం ఉన్న వెంటనే పోలీసు వారికి 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. రోడ్డు భద్రత నిబంధనలుప్రతి ఒక్కరు పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై పాటల రూపంలో మాటలరూపంలో అవగాహన కల్పించారు. ఈ కార ్యక్రమంలో ప్రిన్సిపల్ పి.వరలక్ష్మి, అద్యాపకులు చంద్రలేఖ, కళా, మహేష్, దయాకర్, ఏహెచ్‌టీయూ ఎస్సై మల్లయ్య, కళాబృందం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కళాబృందం సభ్యులు, షీటీం బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News