Friday, November 22, 2024

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలోమూడు రోజులుగా నిర్వహిస్తున్న డ్రగ్స్ అవగాహన కార్యక్రమం ముగింపు సమావేశం సోమవారం యూసుఫ్‌గూడలోని స్టేడియంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా హోంమంత్రి మహమూద్‌అలీ, సినీనటి క్రితిషెట్టి, డిజిపి అంజనీకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతల రక్షణలో తెలంగాణ రాష్ట్రం ముందు స్థానంలో ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.దేశభవిష్యత్తు యువత చేతిలో ఉందని, యువత డ్రగ్స్‌కు అలవాటు పడి భవిష్యత్తును నా శనం చేసుకోవద్దని కోరారు.
డ్రగ్స్‌కు అలవాటు పడితే కుటుంబాలు, సమాజం నాశనం అవుతుందని అ న్నారు.

యువత డ్రగ్స్ బారినపడకుండా ఎంచుకున్న మార్గంలో అద్బుతాలు సృష్టించాలని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం చాలా తక్కువగా ఉంద ని, డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. డ్రగ్స్‌ను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలని అన్నారు. డిజిపి అంజనీకుమార్ మాట్లాడుతూ ప్రతి రంగంలో యువత అద్బుతాలు సృష్టిస్తున్నారని అన్నారు. కొంతమంది యువత మాత్రమే చెడు మార్గంలో వెళ్తున్నారని అ న్నారు. దేశవ్యాప్తంగా 11కోట్ల మంది డ్రగ్స్ బారినపడ్డారని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.

చెడు స్నేహాలు చేసి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. డ్రగ్స్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు కృషి చేయడం అభినందనీయమని సినీనటి క్రితి శెట్టి అన్నారు. యువత ఎక్కువగా డ్రగ్స్‌కు బానిసగా మారడం చాలా బాధకరమని అ న్నారు. దేశానికి యువతే బలమని అన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషి చేయాలని కోరా రు. డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. షార్ట్‌ఫిల్మ్ విజేత రామ్‌కిరణ్‌రెడ్డి, సాంగ్ రోహిణి కుమారి, పోస్టర్ విపిన్‌కు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ సెక్రటరీ భారతీ హోలీకేరి, శైలజా, ఎస్పిలు సునీత, చక్రవర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News